చిత్ర కవిత
తేదీ : 23-09-2022
శీర్షిక : తరువు కంట నీరు
కవిత సంఖ్య : 158+9
అవని మాతకు అందమైన ఆభరణం
జీవరాశికి అనువైన పర్యావరణం
పచ్చందాలను పదిలపరుస్తూ తరువు
భీష్మ గ్రీష్మాలను జల్లించి
పండు వెన్నెలలను కురిపించు ...
కాల మాన పరిస్థితులకు కదులాడుతూ...
రుతువులకు కట్టుబడి ... శశిరంలో
తలలు దులుపుకుంటూ... వసంతంలో
చిగురులేస్తూ జీవరాశిని కాచుకుంటుంది ....
కొండా కోనలకు ఆలవాలమై
ఎండా వానలకు కారణభూతం ...
మరకతమై శోభించు మహీతలం
తరువులన్నీ తలలూపి ఆనందిస్తే ...
అత్యవసరాలకు... అవసరాలకే
కాకుండా ... ఆడంబరాలకు సైతం
తరువులను చెరుగుతూ మనిషి
మానులను మిగుల్చుతున్నాడు ....
తరువులను పెంచడం బరువనకు
మనుషులే కనుమరుగవుతారేమో ...
కనీస ఇంగితమును కలిగి మసులుకో
మానవాళికి ... జీవరాశికి ఇంధనం....
తరువు కంట నీరు పెట్టినా ..తరుణి
కంట నీరు ఒలికించినా ..కాదు శ్రేయస్సు
మానవాళికి....కబళించు కబంధమై
కరువులు కాటకాలు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment