Thursday, December 1, 2022

ఆరోగ్య సిరి తేదీ : 02-08-2022

 ఆరోగ్య సిరి 

తేదీ : 02-08-2022
కవిత సంఖ్య : 158+1

గడియారం ముల్లులతో పోటీ
గమ్మత్తుగ కనుమరుగవుతున్న జీవిత బ్యూటీ
గజిబిజి పాలవుతున్న సావాసపు తోటి
గల్లంతవుతున్న ప్రేమలు సాటి... 

జిహ్వ చాపల్యాల చిత్తమో 
చాంచల్యాల చపలమో 
స్వార్థ కల్తీల ఉక్కుపాదమో 
కపట కలుషితాల క్రీనీడలో ... 
ఆరోగ్య చిట్టాలను అపహరిస్తున్న వేళ ... 

చిన్నా పెద్దా దూరాలకు 
ఏదో ఒక్క వాహనం దిక్కవుతుంటే 
ఆన్లైన్లో ఆర్దర్లు వేస్తుంటే సరుకులకు 
కాదా ఇక కాలు చేయి కదపలేని సౌకర్యం ... 

స్వార్థచింతనలకు సరంగులౌతున్న వైద్యులు
ఉచ్చనీచములు మరుస్తున్న ఫార్మసీలు
పెచ్చుమీరుతున్న లాభాల ల్యాబులు
వెరసి సగటు మనిషి ఈ జలగల పాలు. 

ఆరోగ్యకరమైన జీవితానికి 
అనేకానేక మార్గాలున్నప్పటికీ 
అనారోగ్య నివారణల అమలు 
అన్నిటికన్నా ఎంతో ఉత్తమం ..... 

నలగని శరీరాలకు నడక ఒక నగ 
యోగ ధ్యాన ప్రాణాయామములు 
ఆడ మగ చిన్న పెద్దలకు సులువులే ...  
అనుకున్నదే తడవు ఆచరించి చూడు .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment