సహజాభరణాలు
తేది : 25-08-2022
శీర్షిక : దీక్షా దక్షతల విద్యుక్తము ...
కవిత సంఖ్య : 158+8
యూగాలెన్నో మారుతున్నా
జగాన వెలుగులు పంచడమే
నిశిరాత్రులు ఎన్నింటినో
దాటుకుని తేజరిల్లడమే ....
తాత్కాలికమై మేఘమావరించినా
తనుకులాడక నిశ్చలమై వెలుగులనిచ్చు
శశికికూడా ప్రసరింపజేసి నిశిరా త్రుల
పక్షములుగా వెలుగు పంచు ....
కరటక దమనక నీతులతో
కాలుష్యపు కబంధ హస్తాలెన్ని
కఠిన పరిస్థితులు కల్పిస్తున్నా
కలుపుకు పోయే గుణమే కలియుగంలో ....
జవ జీవాలకు జీవావరణములందిస్తూ
నీటి చక్రాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ
చెట్టు చేమకు పచ్చదనాలద్దుతూ ....
నిర్విఘ్నమై తనపనిలో నియుక్తమే ....
కష్ట సుఖాలకు కదిలిపోకుండా
లాభ నష్టాలకు లొంగిపోకుండా
ఆనంద విషాదాలు అసలు పట్టించుకోకుండా
బాధ్యతల చక్రంలో పరిభ్రమించడమే ...
దీక్షా దక్షతలతో విధ్యుక్తమే ....భాను డు ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment