దేశభక్తి గేయము.
తేది : 15 -08-2022
శీర్షిక : పాడుదమా మనమంతా కవిత సంఖ్య : 960
పాడుదమా మనమంతా
పండగని గొంతెత్తి ...
అణువణువు పులకరించ
తనువంతా మయూరమై
అంబరాల తేలేటి
వజ్రోత్సవ సంబరం
మువ్వన్నెల పతాకం
నింగినంటి శోభించగ
ప్రజలందరి దరహాసం
పగడములై మెరియంగా ...
పాడుదమా మనమంతా
పండగని గొంతెత్తి ...
ప్రజ్వరిల్లిన ప్రజాపథం
మదిమదిలో నింపుదాం
మహనీయుల పోరాటం
ఎద ఎదనా ఒంపుదాం
బోసినవ్వుల పాపాయిల
ముదమారగ నవ్విస్తూ
కల్మషాల జాడలను
దరిచేరనీయకుండా……
పాడుదమా మనమంతా
పండగని గొంతెత్తి ...
మాతృభూమి ఆచారం
మననం చేసుకుంటూ
కర్మభూమి సంస్కృతిని
యువతకు సందేశముగా .....
నిశాచరుల తరిమేసే
వెలుగుపూలు పూయిస్తూ
శౌర్యాలను బోధించే
వీరగాథ వినిపిస్తూ ...
పాడుదమా మనమంతా
పండగని గొంతెత్తి ...
పసిడిపంటల హాలికులకు
పబ్బతులను తెలుపుతూ
తనువులిచ్చే సైనికులకు
ప్రణమిల్లుతు నిలవమని
త్యాగధనుల సౌశీల్యత
తలచి నడుచుకుంటూనే
భరతమాత ఘనకీర్తిని
విశ్వమంతా చాటుదాం ...
పాడుదమా మనమంతా
పండగని గొంతెత్తి ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment