చిత్ర కవిత
తేది : 09-09-2022
శీర్షిక : ప్రకృతితో పరాచికం
ఆడంబర జీవితాలకు
అర్రులు చాచిన మానసం
కన్నుమిన్ను కానక
ప్రకృతిని చెరబట్టిన వైనం ...
వరద నీట మునిగినా
వామనుడల్లే కూర్చుండే
తిరగేస్తూ దినపత్రిక
తీరుబడిగ
పరిసరాలు మరిచి ...
ఆకలి దప్పులకు
ఆరాట పడకుండా
ఆస్తులమీద ఆత్రుత లేకుండా
ఆపద మీద చింతలు లేకుండా ...
స్థిత ప్రజ్ఞతలలో
స్థిర చిత్తుడేమో
ఆపన్న హస్తానికై
ఆశలు పడకుండా ....
ప్రకృతితో పరాచికాలు
పతనమే ఇక మానవాళి
పరవళ్లు తొక్కేయగలదు
పత్తాకు లేకుండా చేయగలదు
నగునూరి రాజన్న
No comments:
Post a Comment