Friday, December 2, 2022

చిత్ర కవిత తేది :19-08-2022

 చిత్ర కవిత 

తేది :19-08-2022
శీర్షిక : కన్నయ్య 
కవిత సంఖ్య : 

కళ్ళు తెరిచింది కారాగారమైనా 
కారణ జన్ముడు మన కన్నయ్య 
అష్టమ అవతారం శ్రీ మహా విష్ణువుకు 
అష్టమి తిథి రోహిణీ నక్షత్రయుక్త జననం ... 

వసుదేవ సుతుండు వామనావతారుడు 
ఆదిశేష శయనుండు  ఆపద్భాంధవుడు ... 
అష్టమ గర్భాన  ఆదిమధ్యాంతరహితుడు  ...   
మధురలో జన్మించిన మాధవుడు ... 

శ్యామసుందరుడు  సద్గుణశీలవతుడు
అల్లరి కృష్ణుడు అనంతపద్మనాభుడు
దేవకి వసుదేవుల వర పుత్రుడు  
యశోద నందనుడు  యదుకులభూషణుడు 

సుందర లీలలు వందల కొలది 
పాలు మీగడల వెన్న దొంగగా 
పడతుల వస్త్రాపహరణలు చేసినను 
ధర్మ పాలనలో భాగంగానే ..... 

గొల్లభామల గోపెమ్మల మనసులు దోచినా   
అమలిన శృంగార రసజ్ఞుడిగానైనా .... 


నగునూరి రాజన్న 

No comments:

Post a Comment