Thursday, December 1, 2022

కొత్త దారుల కోసం తేది : 11-08-2022 శీర్షిక : మానవ కళ్యాణం

 కొత్త దారుల కోసం

తేది : 11-08-2022
శీర్షిక : మానవ కళ్యాణం 
కవిత సంఖ్య : 958

శూన్యంలో స్థిరమైన గ్రహాల
నిరంతర పయనంలా .... 
ప్రకృతే ప్రకృతిలోని నీటిని 
ఒడిసిపట్టి బంధించి తిరిగి 
వర్షించినట్టు చలనశీలత అనివార్యం ..... 

మార్పులో పుట్టి మార్పులోనే 
మనమంతా పెరుగుతున్నాం 
పాతలో పరిణతులు సాధిస్తూ 
కొత్త దనం కోసం పరితపించడమే ... 

లక్షల జీవరాశిని అధిగమించి 
లక్షణమైన జీవన విధానం .... 
ఆకులలముల దశ నుండి 
ఆకాశానికి ఎగురుతున్నాము  .... 

నాగరికతల నడకలు దాటుకుని  
పారిశ్రామికీకతలో యంత్రమై 
మర్మం నిండిన మనిషి ఎప్పుడు 
అర్థ సులభుడు కాదు ... 

ఎప్పటికైనా ఏ కొత్తదారైనా 
మానవ కళ్యాణాల చిరునామాగా 
మనగలిగితేనే పదికాలాలు 
పదిలమై మానవాళి ఫరిఢవిల్లేది .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment