గోదారొళ్ళమన్నా
మేం తెలంగాణా గోదారోళ్ళం
మా మనసు వెన్న సుమా .....
మా ఉనికి మొరటు అయినా
మా గుండె నిండా ఆరాటం ....
అక్షరాస్యత అంతంతైనా
లక్ష్యాలను చేరుకుంటాం ....
కల్లా కపటం లేనోళ్లమే గాని
అల్లాటప్పా మాత్రం కాదు ....
కారం మెతుకుల కడుపు నింపుకున్నా
కాని పనులకు కాలు దువ్వం ....
కడుపు నింపే పనేదయినా
కళ్ళల్లో పెట్టుకుంటాము .......
మా పేర్లు ఊర్లు వింతగనిపించినా
మాప్రాంతం ప్రేమ అమితమైనది....
గంజి మెతుకులను గౌరవించినా ....
గడసరివే మా పిండివంటలు ....
సంక్రాంతికి సకినాలు ...
సదా ఆదరించే సర్వపిండి ....
పిల్లా పెద్దల ...పిండి కుడుములు
వద్దన్నా నంజుకునే ఉల్లికారం .....
వలస వాదంలో వెనుకపడినా
వారెవ్వా.... అనే తీర్థయాత్రలు ...
దక్షిణ కాశి ... దండి వేములవాడ
యమపూరినే ఎదిరించే ... ధర్మపురి
శక్తిపీఠం ..... జోగులాంబ ...
ద్వాద జ్యోతిర్లింగం .... కాళేశ్వరం
మల్లన్న బోనాలు .... మా ఓదెలలో
మరిచిపోలేని అంజన్న .... కొండగట్టున
ఏకైక మత్స్య గిరీంద్రుడు ...... కొత్తగట్టున
ఎదురు లేని వీరభద్రుడు ..... కొత్తకొండన
అందరిని కాచుకునే ఆదర్శ మూర్తి
ఆ రాఘవేంద్రుడు ....భద్రాచలమందు ....
బాసరలో .... శారదాంబ
భవ్య చరితల .... కోటిలింగాల
కురిక్యాల శాసనాలే .... కులపెద్దగ
నిలిచె కదా ... వేయేండ్ల తెలుగుభాషకు
వెన్నెముకై దన్నుగా .... ....
వన్నెలు దిద్దుకుంటున్న యాదగిరి
వటవృక్షపు చరిత్రల .... పిల్లలమఱ్ఱి
యునెస్కో గుర్తింపుల రామప్ప
కాకతీయుల వెలుగు వేయిస్థంభాలు ....
భవ్య రూపమున దర్శనమిచ్చే
భద్రకాళీ.... బహుదూరాన నిలిచిన
హేమాచల నరసింహస్వామి ...
బంధుమిత్రులతో వ్రతమాచరించే
గూడెం సత్యనారాయణ స్వామి .....
ఒకటేమిటి ..... ఓపికుంటే ....
సమ్మక్క .... సారలమ్మ .....
సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి
అరుదుగా దర్శనమిచ్చు ....
ఆదివరహా స్వామి (కమాన్ పూర్ )
ఛాయా సోమేశ్వరస్వామి - పానగల్
నల్గొండ .....; అనంత పద్మనాభస్వామి
వికారాబాద్ .... కొండగట్టు అంజన్న ....
చిలుకూరు బాలాజీ .... కీసర రామలింగేశ్వర
స్వామి .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment