Thursday, December 1, 2022

చివరంచు దాకా తేది : 07-06-2022 శీర్షిక : నిత్య విద్యార్థులమే ..

 చివరంచు దాకా

తేది : 07-06-2022
శీర్షిక : నిత్య విద్యార్థులమే ..... 
కవిత సంఖ్య ;916

బాదర బందీలు లేని బాల్యంలో 
ఆడింది ఆట పాడింది పాట...  
ఆత్మీయమే మిత్రులతో ఆట  
ఆకతాయి పనుల పాటవాలే... 
నిత్య దిన చర్య ..... 

ఒక్కసారి జ్ఞాన సముద్రపు జిజ్ఞాసలో 
అడుగిడితే మాత్రం ఈదుతున్న 
చేపలమే ....చేరుకోలేని వైశాల్యం 
అందుకోలేని అగాథం....అనంతం .... 

గడిచిన ఘనమైన చరితలో 
కాలం విడిచిన ఊహల కథలో 
విజ్ఞులు రచించిన విరచిత గ్రంథాలో 
పరిసరాలు పదిలపరిచిన జిజ్ఞాసలో .... 

ఖగోళంలో నిలిచిన కవ్వింతలో 
గ్రహాంతరాలలోని గమ్మతులో 
సంద్రపు నిడివిలోని సవ్వడులో 
విశ్వ జీవరాశి వింతల వివరాలో ....  

పరవశాల అంచుల్లో విహరించే 
పశుపక్షాదుల జీవన శైలులో 
ఆధ్యాత్మికతలు మూటగట్టుకున్న 
పర్వతరాజుల పవిత్రతలో ... 
పచ్చలు పొదిగిన అరణ్యతోరణాలో ....  
ప్రకృతిలో పల్లవించే పదనిసలో ... 

విరామమెరుగని వింత జీవితం... 
విశ్రమించకుండా చివరంచుదాకా  
చదివినా... నిత్య విద్యార్థులమే 
మనమంతా ఈ జగాన ..... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment