వెలకట్టలేని జ్ఞాపకాలు
తేది 21-09-2022
శీర్షిక : బంగారు బాల్యం ...
కవిత సంఖ్య : 01
అక్షర జ్ఞానాల అంగవస్త్రాలను
ధరించి క్రమశిక్షణగా అడుగులు
కదిపాక ... బాల్యాన్ని ఒక్కసారి
దులుపుకుంటే అరలనిండా
మరామరాలే....
తెలిసీ తెలియని తనములో
తేనె మధురిమలు గ్రోలిన బాల్యం ...
ఆటల్లో అల్లరిగా గొడవ పడినది
తొండి చేసి తోటోళ్లపై గెలిచినది ....
ఆటపాటల్లో అలరించిన మిత్రులు
అటకలెక్కి ఆడుకున్న వైనాలు ...
చూచి రాతల గందరగోళాలు
మాష్టార్లతో దెబ్బలు తిన్న సందర్భాలు ....
వేసవి సెలవులన్నీ బావుల్లో ఈతలతో ...
పంట చేలల్లో పడి పోయి తింటూ...
చెట్టులెక్కగలవా ... గుట్టలెక్కగలవా ...
అంటూ సీతాఫలాలు ... నేరేడు పండ్లు
తింటూ ... రైతులతో దాగుడు మూతలాడింది ....
బాధ్యతల బరువులను తలకెత్తుకోమంది
బహులెస్సగ చదువులు సాగిస్తూ ...
బలాదూరుగా తిరిగిన క్షణాలు ...బాకీ
పడిన చోట అమ్మా నాన్నలు తీర్చిన ముచ్చట్లు ....
ఒక్కటేమిటి... ఒడువని ముచ్చట్లే అన్నీ
నాటి యాతనలన్ని నవ్వులు తెప్పిస్తుంటే
బాధ్యతల బరువులెంత భద్రంగా చూడాలో
నా కాకమ్మ కబుర్లన్నీ కథలోలె పిల్లలకు
చెప్పి నవ్వుల హరివిల్లులు పూయించేవాణ్ణి ...
అరలలో నుండి తీసి ఆరబోసుకుంటే
బాల్యమంతా బంగారుమయమే ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment