అణుశక్తి
తేదీ 27-07-2022
శీర్షిక : బొమ్మా .. బొరుసా ...
కవిత సంఖ్య : 144+12
అందుగలడు ఇందులేడని
సందేహము వలదు
చక్రి సర్వోపగతుండెందెందు
వెదికిచూచినా యందందే గలడన్నట్లు ...
అణువు సర్వాంతర్యామి
విశ్వమంతా ... వినీలాకాశమంతా ...
విచ్చేదనమైనా ... సంలీనమైనా
సంప్రాప్తమే శక్తి సుసంపన్నం ....
అణువంటే అలుసు చేయకు
అండదండలై జోడించాలన్నా ...
జాతి మొత్తాన్ని విచ్చిన్నం చేయాలన్నా ...
ఇరువైపులా పదునైన కత్తిలాంటిది ....
మానవ మేధలో మొలిచిన
ఆలోచనలకు అంకురమై ఎదిగి ...
పారిశ్రామిక విప్లవంలో పరిపుష్టమై
రెండవ ప్రపంచ యుద్ధంలో
మానవాళి నాశనానికి నాంది పలికింది....
మనిషిలోని మద మాత్సర్యాలకు
ఆయుధంగా తోడైతే జీవరాశికే
మహోత్పాతం... మహమ్మారి ...
మానవతలకు మకుటాయమానమైన
మంచివారి చేతిలో మసిలితే
మానవ కళ్యాణమై మహోన్నతమౌతుంది .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment