Thursday, December 1, 2022

వజ్రోత్సవాలు తేది : 11-08-2022 శీర్షిక : ఆజాదికా అమృతమహోత్సవం

 వజ్రోత్సవాలు

తేది : 11-08-2022
శీర్షిక : ఆజాదికా అమృతమహోత్సవం
కవిత సంఖ్య : 158+3

వజ్రోత్సవాల వసంతం 
వీరులెందరికో వందనం 
వల్లెవేసుకునే సంబరం   
ఆసేతు హిమాచల నందనం .... 

ఇంటింటా త్రివర్ణ పతాకం 
రెపరెపలు శోభ పల్లె పట్నం 
ఇనుమడించిన దేశభక్తి భావం 
ఇగురించె కులమతాలకతీతం... 

ఉద్యమాల పిక్కటిల్లే భారతం 
శంఖమూదే స్వదేశీ నినాదం 
గుప్పుమన్న ఉప్పు సత్యాగ్రహం 
గుండెలదిరే సిపాయి తిరుగుబాటుతనం .... 

అల్లుకున్న అతివాదం మితవాదం 
చుట్టుముట్టె తెల్లోడిని ముసలం 
స్వరాజ్యమే నా హక్కన్న నినాదం 
సాధించిరి ఒక్కటై స్వాతంత్య్రం...  

వీరులెందరో ముద్దాడిరి ఉరికంభం 
మృత్యువులను చిరునవ్వులప్రాయం 
చరితకెక్కని చిరుతపులులనేకం 
చిత్తరువులు కూడా దొరకని వైనం ..... 

అందరిని వల్లెవేయ ప్రతినబూనినం 
సగర్వమైన సమరయోధుల స్మరణం 
అదేకదా ఆనందాల వజ్రోత్సవం 
అడుగడుగున ఆజాది అమృత మహోత్సవం  .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment