ఆజాదీకా అమృత మహోత్సవము.
సహస్ర కవి సమూహం 624
నగునూరి రాజన్న
గేయం….
తేది : 09-08-22
చెయ్యెత్తి జై కొట్టు భారతీయుడా
గర్వంగా జెండాకు వందనమని
అమృత వజ్రోత్సవ నందనమని …
ఇంటింటా ఆనందం వెల్లి విరిసె భారతం
ఇగురించిన శోభల ఇనుమడించె త్రివర్ణం ....
కులాసాల రెపరెపలు కులమతాలకతీతం
వినువీధుల సగర్వమై వీరుల త్యాగఫలం .....
// చెయ్యెత్తి జై కొట్టు//
చిరునవ్వుల ప్రాయంగా ముద్దాడిరి మృత్యువును
ఉరికంబాలలుముకుని చిరంజీవులాయిరి .....
చరితలోని కెక్కని చిరుతపులులు ఎన్నెన్నో
చిత్తరువులు సైతం అందుబాటు లేవేమో ...
// చెయ్యెత్తి జై కొట్టు//
లెక్కలేని ఉద్యమాల పిక్కటిల్లే భారతం
స్వదేశీ శంఖమూదె విదేశీ బహిష్కారం
సిపాయిల తిరుగుబాటు గుండెలదిరె శత్రువుకు
నిప్పోలే రాజుకునే ఉప్పు సత్యాగ్రహం...
// చెయ్యెత్తి జై కొట్టు//
అతివాదం మితవాదం అల్లుకున్న పోరాటం
ముప్పేటల దాడిగా ముసురుకునే తెల్లోడిని ..
ఆసేతు హిమాచలం అలుపెరుగక పోరాడిరి
స్వరాజ్యమే నా హక్కని సాధించిరి నినదించి .....
// చెయ్యెత్తి జై కొట్టు//
వజ్రోత్సవ వేళలో వల్లె వేయ ప్రతినబూని
సంస్తుతించు సగర్వమై స్మరణలతో సమరయోధుల ....
ఆదరించి వీరులను అందరికి నివాళిచ్చి
అడుగడుగున మననమే ఆజాది అమృతము ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment