వినాయక చవితి
తేది : 31-08-2022
శీర్షిక : పార్వతి పుత్రా
కవిత సంఖ్య :
పార్వతి పుత్రా పరమ పావనా
విఘ్న వినాయక పాహిమాం ....
ఆదిపూజలకు నీవేనయ్యా
ఆదిదంపతుల వరపుత్రుడవు
తల్లిదండ్రులే సకలతీర్థములని
ఎల్లలోకములకు చాటితివే….
గజముఖమును ధరించినీవు
గణనాయకుడవు అయ్యావు ...
భవ్యరీతిన భారతం లిఖించి
భక్తసులభుడవై బ్రోచితివి …
పత్రిపూజలే పవిత్రమంటూ
పరవశమంది కోర్కెలు తీర్చితివి
ప్రమద గణముల నాయకుడిగా
ప్రజలను చల్లగా చూడుమయా ...
మూషికమ్ము వాహనమవగా
మురిపించితివా సకలజీవులను ....
మరుగుజ్జు రూపము తోనే
ముజ్జగములను పాలించితివి ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment