Monday, March 6, 2023

గజల్ పై కవిత

 గజలులంటేనే గమ్మత్తుగా వుంటుంది

గజలంటే పఠనమే కాదు గానం కూడా 
భావం భాషలు జోడుగుర్రాలై పరుగెత్తు 
పారసీ ఉర్దూ అరబ్బీల వలస సాహిత్యం 

గణాల కొలతల గజలుల  లెక్కుంటే 
కనిసము పంచమిల ద్విపదల అందం 
మత్లతో మొదలయి మక్తతో ముగింపు 
మిస్రా,మిశ్రా ఊలా లంటూ షేరులుంటే ... 

రదీఫ్ పదాలతో రంజిల్లు గజలులు  
ఫరిఢవిల్లు ఖాఫియాలు ప్రాసలుగా 
తమాయించు తఖల్లూస్ చివరలో 
రచయితను రమ్యంగా పొందుపరిచి … 

గణాల లెక్కలతో గతులు పక్క
తిస్రగతి చతురస్రగతి మిశ్రగతి 
ఖండగతి సంకీర్ణగతుల విభజన 
కొన్ని పరిమితుల కోటరీల ప్రక్రియ ... 

No comments:

Post a Comment