Friday, December 2, 2022

గజల్ తేది : 25-08-2022

 గజల్ 

తేది : 25-08-2022
కవిత సంఖ్య : 

గదాధరుడు కాలగమన 
మార్పులతో పరమహంస 
కళలపైన ఇష్టములో 
మెప్పించెను పరమహంస 

కాళిమాత మందిరమున 
పూజారిగ  స్థిరపడినా 
పట్టుబట్టి ప్రత్యక్షము 
సాదించెను  పరమహంస 

మనమతమూ పరమతమూ 
పరమసత్యం తెలిసికొనగ 
పరితపనల పరిశ్రమలు   
గావించెను పరమహంస 

సృష్టిలోన  ఏకత్వము 
జీవులలో  దైవత్వము 
మతములన్నీ ఒక్కటనీ 
శోధించెను  పరమహంస 

దేవుడంటె  ఒక్కడనీ 
మతాలన్ని మార్గములని 
అనేకముల తత్వములను 
బోధించెను పరమహంస 

తోతాపురి గురువులతో 
అద్వైతము జ్ఞానమునూ 
బ్రాహ్మాణీ  ఆత్మసాక్షం  
అభ్యసించెను  పరమహంస

శిష్యులలో శిఖరమాయె 
అద్భుతమే నరేంద్రుడూ 
విశ్వవీథి  రారాజుగ
వినిపించెను పరమహంస ... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment