కవన రవళి
బాలల గేయం
18-09-22
అందమైన బాలలూ
ఆడి పాడుకుందామా
బుడిబుడి అడుగులతో
బురిడీల బుజ్జాయిలూ
అడుగులోన అడుగువేసి
కలివిడిగా ఆడుదామా ...
కిలకిలా నవ్వులతో
చిట్టి చిట్టి పాపాయిలూ
దరహాసం పూయించి
ఆనందం పండిద్దాం ...
గణగణ గంటలు మోగంగానే
బిరబిర బడికి చేరండి ...
అమ్మా నాన్నల మెచ్చుకోలుగా
గలగలమంటూ చదవండి ...
తళతళ మెరుపులు మెరియంగా
కల్లా కపటం లేకుండా
చిటపట చినుకుల తాళంతో
నింగీ నేలా ధారగా కురిసే ....
గబగబ చెరువులు నిండంగానే
హాలికులంతా ఆనందాలే
పుష్కలాల పంటలతో
ప్రజలంతా నందనాలే ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment