Friday, December 2, 2022

ఆత్మీయతా సిరులు 2 ---తేది : 01-09-2022 శీర్షిక : ఔషధ లేపనాలు.

 ఆత్మీయతా సిరులు 2

తేది : 01-09-2022
శీర్షిక : ఔషధ లేపనాలు. 

జీవనది చెలిమెలా ఊరుతుంది 
భావఝరి వసంతమై పొంగుతుంది 
ఒక్కసారి ఒడిసి పట్టుకున్నామా 
వదిలిపెట్టాలని మనసు రాదు .... 

కుసుమ లతలై అల్లుకొంటుంది
పరిమళాలు వెదజల్లుతుంది 
ఆ ఘుమఘుమలకు అలవాటైతే 
విడిచిపెట్టమంటే మనసు కష్టం ... 

మృదుమధురమై పరవశించు 
పూసుకున్న గంధంలా శోభించు 
తేనె మధురిమల జ్ఞాపకాలతో 
మళ్ళీ మళ్ళీ అదే దారికి అడుగుపడు ... 

చోరుల భయమక్కరలేనిది 
అధికార దర్పంతో అడ్డుకోలేనిది 
మనసు పత్రహరితమైతే 
మందారాల పూదోటలే  అంతటా .... 

స్పర్థల గోతులు లాగాలని చూసినా 
మర్రిమానుల ఊడలై రక్షిస్తాయి ... 
అసూయ కీటకాలు ఆశపడినా 
ఆప్యాయతల ఔషధ లేపనాలైతాయి .... 

విరబూసుకున్నవిరుల గొడుగును 
గాలిదుమారాలకు గాబరా 
కానీయకుండా ... పదిలపరిచి 
అందిస్తుంది ముందుతరాలకు ....  
ఆత్మీయతా సిరుల ఝరి…. 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment