కాఫీ దండకం
తేది : 13-09-2022
శీర్షిక : తెల్లోడి మాయ
తెల్లోడి మాయతో
తెల్లారుతుంది నేడు ...
కాఫీయో ఛాయా లేనిదే
కదలదు బండి ఈనాడు ...
కాఫీకి కలిసొచ్చింది
ఘుమఘుమల మాధుర్యం
కడుపులో పడితేనే
మిగతా ఏ పనులైనా ....
చిక్కని పాలతో కలిపితే
కమ్మని కాఫీ తయ్యారు ...
లేదంటే మనసంతా
ఆ రోజు ఉస్సూరు ....
చిన్నా పెద్ద సందర్భం
మిత్రుడొచ్చినా ...
పుత్రుడొచ్చినా ....
కావాల్సిందే ఓ కప్పు ....
ఉరుకుల పరుగుల
జీవితాలకు పెద్ద దిక్కైంది
అతిథి మర్యాదల్లో అగ్రగామిగా
వచ్చిన వారికి ఇచ్చుకోను ....
అతి సర్వత్రా వర్జయేత్ లాగ
మితి మీరితే ... అనారోగ్యాలు
తస్మాత్ జాగ్రత్త ...
పారాహుషార్ .....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment