గజల్
తేది : 29-07-2022
కవిత సంఖ్య : 948
దక్కనులో పిక్కటిల్లె
వెలుగుపూల మణిహారం
దుక్కిదున్నె మాతృభాష
తెలుగుపూల
మణిహారం
వీధిబడే వింతగాను
విశ్వమంత వెలుగునింపె
హరికథలూ బుర్రకథలు
అలుగుపూల మణిహారం
సాహిత్యపు చెలుకలోన
సౌరభాలు పూయించే
సౌహార్దపు సాకేతుడు
భాషపూల మణిహారం
లెక్కలేని కావ్యాలను
బొక్కసాలు నింపేసిన
వెండితెరల జాడలలో
నింగిపూల మణిహారం
రాజసాల గాంభీర్యం
రారాజుగ వెలుగొందే
కవిత్వాన్ని శ్వాసించిన
తపః పూల మణిహారం
నగునూరి రాజన్న
No comments:
Post a Comment