రంగస్థలం
తేది : 27-07-2022
శీర్షిక : విడమరచిన హైందవం ...
కవిత సంఖ్య : 947
ఇంద్రధనసులోని ఇంపైన
రంగులున్నా....లేకున్నా...
చీకటి వెలుగుల
నలుపు తెలుపులైనా ...
హంగూ ఆర్భాటాలు ఉన్నా...
దిక్కు దివాణం లేకున్నా...
మురుగుజ్జుల పొట్టైనా ....
ముంత తాడిచెట్టు పొడవైనా ...
రిక్కలాంటి బక్కపలుచనైనా
దుక్కలాంటి లావైనా ....
నిక్కచ్చిగా ఆడవల్సినదే ....
కనిపించని సూత్రధారి కథలో
కల్పించిన పాత్రలు పోషిస్తూ ...
ఇష్టాఇష్టాలను పక్కన పెట్టి
కష్ట నష్టాలను అధిగమిస్తూ ....
సుఖ దుఃఖాలను భరిస్తూ ....
కథను ఆద్యంతం ఎవరైనా
రక్తి కట్టించాల్సిందే ...
గమ్యాలు మారుతున్నా ...
గమనాలు మారుతున్నా ....
ప్రారంభాల ముహూర్తం
తెలియక .... ముంగిటనే
ఉన్నముగింపు ఉనికిని
గుర్తించక లేక పోయినా ...
పాత్ర పోషించవల్సిందే ....
కారణమెరుగని కర్తవ్య
నిర్వహణలే.... కానీ...
ప్రతిఫలాపేక్షలు లేకుండా
చేయాలన్నదే గీతా సారాంశం ...
అద్వితీయమైన హైందవం ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment