గమ్యం దిశగా గమనం.
తేది : 27-09-2022
శీర్షిక : మానవత్వమే ప్రాధాన్యం…
కవిత సంఖ్య : 996
ఆలోచనలతో అంటకాగుతూ
నిరంతర మేధోమధనాలతో
పొంగి పొర్లాడుతూ...మేలిమి
సౌకర్యాల కోరిక వేటల పోరాటంలో
మనిషి జీవరాశిలో మిన్నయ్యాడు .....
మానవాళిని ప్రత్యేకతలతో నడిపించి
రాతి గుహల జీవితాలను రంగుల
మయంగా మార్చి మురిసింది ....
నాగరికతల తోటలో నడకలు నేర్పింది...
ఆలోచనల అంకురం ...
ఆకులలములు...పచ్చి మాంసాల
భుజింపుల నుండి ... వంటా వార్పులు
నేర్పించి వండి వార్చుకుని వడ్డించుకునే
షడ్రుచుల మేళ తాళాలతో జిహ్వ
చాపల్యాలను ఛేదించింది...వివేక విచక్షణలు...
పరిసరాల పరిశీలనలలో ... ప్రశ్నించే
గుణం నేర్పి ....ఫలితాలను రాబట్టుకు నే
పరిపక్వతలనందించి ...నిరంతర కొత్తదనం
కొరకై .... ప్రయోగాల ప్రయత్నాలతో పవిత్ర
చేతి వృత్తులను చేరదీసింది....జిజ్ఞాస ....
పారిశ్రామికీకతల ప్రగతి రథమెక్కి
పట్టనీకరణల
ఫరిడవిల్లుతూ…
సాంకేతిక సౌరభాలను ముద్దాడుతూ
విచిత్రంగా విశ్వాన్నే గుప్పిట బంధించి ...
పొరుగు గ్రహాలపై కన్నేశాడు...విజ్ఞానం ...
ఏదేమైనా ...సాటివారిని సన్నుతించి...
పొరుగు క్షేమం పొందు లాభమంటూ ....
మంచి మనసులకు చోటివ్వమంటూ ...
నలుగురి క్షేమాలు కోరితేనే...మానవత్వం...
భిన్నత్వంలో ఏకత్వంలా…శాఖోపశాఖల
గమనమెలా మారినా…తరువు లాంటి
మానవ సంక్షేమాలను నెత్తికెత్తుకుంటేనే …
విశ్వశాంతి విరాజిల్లుతుందనేది పరమసత్యం.
నగునూరి రాజన్న
No comments:
Post a Comment