వినాయక చవితి
తేది : 31-08-2022
శీర్షిక : రావయ్యా గణపతి
కవిత సంఖ్య : 974
రావయ్యా గణపతి
రారాజుగ ధరణికి
చవితి పండగొచ్చింది
సందళ్ళను తెచ్చింది
అవనిపైన మేముజేసె
అర్చనలు పూజలతో ....
ఉండ్రాళ్ళు కుడుములు
దండిగా సమర్పింతు
పూజలంద రావయ్యా
పిండివంటలారగింప
// రావయ్యా //
అమ్మ నాన్న తమ్ముడు
సిద్ది బుద్ది దేవేరులతో
క్షేమ లాభ పుత్రులతో
సపరివార సమేతమై
వెండికొండ దిగవయ్యా
వేగమే నువ్వు రావయ్యా
దండి దొరవు నీవాని
మండపాలు వేసాము...
రావయ్యా గణపతి
రారాజుగ ధరణికి
ఊరూరా ప్రతిష్టించి
ఉత్సవాలు జరిపేము
వాడ వాడ పొగిడి నిన్ను
వరాలనే కోరెదము ...
పిల్లలకు నేస్తముగా
పెద్దలకు దైవంగా
మదిన నిన్ను తలిచేము
మారాజుగ కొలిచేము...
// రావయ్యా //
శాపాలను వరములుగా
మలుచుకున్న మారాజువు
పాపాలను పాపి మమ్ము
బ్రోచంగా రావయ్యా ....
చిత్రమైన రూపంతో
విచిత్రాలు చూపించ
మూషికమ్ము వాహనమై
ముజ్జగముల పాలింపా ...
రావయ్యా గణపతి
రారాజుగ ధరణికి
భారతమ్ము రచియించి
పంచమవేదంగా ప్రసాదించి
సుసంపన్నం గావిస్తివి
సుందరాన హైందవాన్ని ....
శక్తి యుక్తి సిరి సంతోషాల
పరిపూర్ణతల తత్వంగా
పత్రిపూజల ప్రసన్నాల
సమ్మోహన స్వరూపుడవై ....
// రావయ్యా //
గణనాయక రావయ్యా
విఘ్నములను బాపంగా
తొలిపూజకు స్వామివై
విజయాలను కూర్చంగా
ఓంకారము నీవుగా
చదువులకు మూలమై
వేదాలకు నిలయంగా
జ్ఞానాలకు మూలమై ....
రావయ్యా గణపతి
రారాజుగ ధరణికి
నగునూరి రాజన్న
No comments:
Post a Comment