కవన రవలి
గజల్ 21-08-2022
మధురలోన జన్మించగ
కదలివచ్చె గోపాలుడు
బృందావన విహారిగా
తరలివచ్చె గోపాలుడు
యశోదమ్మ మాతృత్వం
ఎదలు నింపి తృప్తిపరిచె
మన్నుతినీ మహిని చూపె
మరలవచ్చె గోపాలుడు
కాళిందిని లొంగదీసి
గోవర్ధన గిరినెత్తీ
వ్రేపల్లెను మనసారా
కాయగవచ్చె గోపాలుడు
కంసున్నీ చాణూరుల
కడతేర్చగ మథురకునూ
బలరాముడు వెంటరాగ
తిరిగివచ్చె గోపాలుడు
అష్టమహిషు ఇష్టసఖుడు
సుధామునీ మిత్రుడిగా
పాండవులకు సన్నిహితై
వరములిచ్చె గోపాలుడు
నగునూరి రాజన్న
No comments:
Post a Comment