విశ్వనరుడు
తేది : 28-09-2022
శీర్షిక : నవయుగ కవి చక్రవర్తి
కవిత సంఖ్య : 997
వీరయ్య లింగమ్మల వీరపుత్రుడు
వినుకొండ మండలం ముద్దు బిడ్డడు
సామాజికాంశాలతో సద్దు చేసాడు
కవిత్వమే ఆయుధంగా తిరగబడ్డాడు ....
సృజనాత్మకతలో సుందరుడు
గరిమ "గబ్బిలం" ప్రఖ్యాతమాయె
మేఘసందేశమోలే మెరుపులీని
వారి రచనలోకెల్ల పరమవిశిష్టమై ....
కోటి కాంతుల స్పందనల
కోమలమైన కవి మనసును
కోరి సృశించె"ఫిరదౌసి" గా
కొనియాడుతూ అద్భుతమై ....
కాందిశీకుడు .. తెరచాటు.. లు
బాపూజీ... నేతాజీ... కొత్తలోకం ...
బుద్ధమహిమ ... సింధూరం
ఆదిగాగల అనేక రచనలు ....
అగ్రవర్ణాల దౌష్ట్యాన్నే కాదు ...
అంతిమ వర్ణాల అజ్ఞానాన్ని సైతం
అంతే నిశ్పాక్షికంగా నిరసించిన
వితరణశీలి ....
బూర్జువాల బూజు దులిపినా
సున్నితంగానే సూచనలుచేసే ....
అవమానములను అధిగమించి
సాహిత్యమే సమాధానంగా
అనేక సత్కారములను పొందె ....
పదనిసలై పారినవి వారి కవితా పల్లవులు
పరమ శ్రేష్ఠునిగా అభినందించ బడ్డాడు
పరమ పూజ్యుని చరితపై పరిశోధనలెన్నో ....
సన్నుతింపబడె సగౌరవంగా
శాసనమండలిలో సభ్యత్వమిచ్చి .
తానై వరించె పద్మ పురస్కారం సైతం ... .
నగునూరి రాజన్న
No comments:
Post a Comment