ఎనిమిదో అడుగు
తేది : 23-08-2022
శీర్షిక : ఆశల హరివిల్లు
కవిత సంఖ్య 967
సంప్రదాయాల సమున్నతం
సంస్కృతికి హిమాలయం
వేదపురాణాల కాలంనాటి
వివిహా మహోత్సవ కార్యక్రమం ...
బాజా భజంత్రీల మంగళవాద్యంతో
బంధుమిత్రుల ఆశీర్వచనాలతో
పంచభూతాలను సాక్షి చేసుకుని
విప్రుల వేదమంత్రాల "మమ"లతో ...
హైందవాచారాలనేకమైనా....
ఆడంబరాలకు పీటలు వేసినా ...
ప్రాంతాలలో రూపాంతరమైనా ...
ప్రముఖ ఘట్టమే సప్తపది పెళ్ళిలో.....
ధర్మార్థకామమోక్షములు వ్యక్తి గతమైనా
ధర్మబద్ధంగా సంఘహితమై నిర్వర్ తించ
విధి విధానాల అర్హతలతో
ఆశల హరివిల్లులన్నీ ప్రోదిచేసుకుని
ఆశయాల సాధనలో అత్తింట
వేసే అడుగే ఎనిమిదో అడుగు ....
పరస్పర గౌరవ మర్యాదలతో
నిండు నూరేళ్ళ పంటయి
పండు వెన్నెలలను పలకరిస్తూ
జీవితాంతం పులకరించేది ...
నగునూరి రాజన్న
No comments:
Post a Comment