ఆలోచన
తేదీ : 23-09-2022
శీర్షిక : జీవరాశి క్షేమం
మనిషెప్పుడూ నిరంతరాన్వేషి
నిత్యనూతనల మేధోమధనం
ఎల్లలెరుగని మేధో సంపత్తి
ఎల్లెడలా ఆశావాది ....
నిన్నటి మీద నేడెప్పుడూ గొప్పే
అనుభవాల సారంతో ఆలోచనల
ప్రవాహం మలుపులు తీసుకుంటూ
మంచికి కంచెలు వేస్తూ సాగేది ....
పారిశ్రామికీకతల ఫరిడవిల్లి
పట్టణీకరణల పుట్టగొడుగులై
రంగు రంగుల ప్రపంచాన్ని
పరిచయించింది ఆలోచనల
అంకురమే ...
సాంకేతికత సంబరాలలో ముంచి
సౌర కుటుంబ రహస్య ఛేదనలకు
సైతం సై అంటున్నది ఆలోచనల
తరంగమే ...
ఆలోచనలెప్పుడూ అమ్మ ప్రేమలా
అమృతమయమై ...అవని రక్షణల
మంత్రమై ... జీవరాశికి మానవాళికి
మేలు మలుపై ఉంటేనే అందం చందం ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment