గోవు తల్లికి జబ్బు చేసింది
తేది : 23-09-2022
శీర్షిక : కళ్ళు తెరువు మానవా ...
కవిత సంఖ్య : 002
ముక్కోటి దేవతలకు మూలపుటమ్ము
నాగరికతల నడకల్లో మనిషికి వేగుచుక్క ...
కాదేది అసందర్భం... కమనీయమే
పాలు పేడ పంచకం.. ఔషధాలుగా
కృష్ణుడిచే కొలువబడిన పుణ్యమూర్తి ...
జీవరాశిలో మిన్నగా విర్రవీగే మనిషి
పవిత్రమైన పంచభూతాలను, ప్రాణకోటిని
కల్తీలతో ,కాలుష్యాలతో,రసాయనా లతో .
చెరబడుతున్నాడు ...
ప్లాస్టిక్కులో పడేసే తినుబండా రాలే
శాపంగా మారి జబ్బు పడుతున్న ఆవులు ...
గోహత్య పాపాలతో కొట్టుకుపోకుండా ...
ఇకనైనా కళ్ళు తెరువు మానవా ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment