భక్తి గేయాలు
తేది : 03-09-2022
శీర్షిక : యాదగిరి నరసన్నా
కవిత సంఖ్య : 977
యాదగిరీ నరసన్నా
యాతనలన్నీ బాపుమయా
మహా ఋషి నామము తోడ
మహిమాన్వితము నీ కొండా
అవతారాలలో నాల్గవదిగా
అవనిపైన వెలసితివయ్యా ...
అంజన్నే క్షేత్రపాలకుడు
ఆర్త జనులను రక్షించంగ
ఘన పూజార్చనలతో
పుణ్యక్షేత్రమై వెలసింది ....
యాదగిరీ నరసన్నా
యాతనలన్నీ బాపుమయా
దుష్ట శిక్షణే పరమార్థముగ
హిరణ్యకశుపుని వధియించి
శిష్టరక్షణలు గావించి
ప్రహ్లాదున్నీ బ్రోచితివి .....
చక్షువులన్నీ భక్తులపైనే
ప్రసరించి పరిపాలించ
భక్తజనులను బ్రోవగ నీవు
లక్ష్మీనారసింహుడవైతివి ....
యాదగిరీ నరసన్నా
యాతనలన్నీ బాపుమయా
నిత్య కళ్యాణం పచ్చతోరణం
నిండుగ నీకే మొక్కెదమూ
పంచ నారసింహ క్షేత్రంగా
పరిఢవిల్లే ఆనంద నిలయం
ఆరోగ్యాలకు అధిపతిగా
తెలుగు వాకిట నడయాడి
గ్రహపీడులకు బాసటగా
అమ్మవారితో సహా వెలిసావు ....
యాదగిరీ నరసన్నా
యాతనలన్నీ బాపుమయా
జయవిజయులను బ్రోవంగా
జన్మించితివా భువిపైనా
భక్తసులభుడవు నీవేనంటూ
బహుచక్కంగా బోధించితివి ...
షట్కోణములో సుదర్శనం
కలియుగమందు నీ దర్శనం
భక్తులపాలిట సంజీవనమే
దుష్ట సంహారం గావిస్తూ ...
యాదగిరీ నరసన్నా
యాతనలన్నీ బాపుమయా
నగునూరి రాజన్న
No comments:
Post a Comment