గిడుగు వెంకట రామ్మూర్తి
తేది : 29-08-2022
శీర్షిక : వాడుక భాష వారధి
కవిత సంఖ్య : 158+9
మారాజు వీర్రాజు వెంకమ్మల కన్నబిడ్డ
శ్రీకాకుళం తెలుగువారి ముద్దుబిడ్డ ...
పట్టుదలకు పెట్టింది పేరు
కార్యదీక్షతల కార్య శీలుడు .....
గ్రాంధీకం ఒక గమ్మత్తని
వాడుక భాష గొప్పతనాన్ని
వర్ణించి వర్ణించి భుజానేసుకుని
పిడుగైన గిడుగు ... వాడుకభాష గొడుగు ...
సరస్వతీదేవి నోములపంటగా
సభాముఖంగా కొనియాడే నాడు
విశ్వనాథుడు వీరగంధముతో ....
భాషాసేవకు బహుచక్కగా గిడుగువారిని ...
గురజాడవారితో కలిసి సంవత్సరాలు పోరి
పండితులకు నచ్చ జెప్పి ...
పామరులకు విప్పి చెప్పి
పటుతరముగా వారధిగా నిలిచే ...
సవరభాషను సాంతంగా నేర్చుకొని
సంకల్పించెను వారి భోధనలకై ...
సవరభాషను సమున్నతము చేయ
భాషా భాగాలు , వ్యాకరణం , శబ్దకోశం
రచించగా ... గౌరవించె నాటి ప్రభుత్వం
కైజర్ ఏ హింద్ స్వర్ణపథకంతో .....
తెలుగును అధికార భాషగా
చేయడంలో ఎనలేని సేవలు
చేసిన శ్రీ గిడుగు గారిని
ముందు తరాల వారు ముదముగ
స్మరించవలసినదే ....
నగునూరి రాజన్న
No comments:
Post a Comment