సర్వేపల్లి రాధాకృష్ణన్
తేది : 05-09-2022
శీర్షిక : విదుషీమణి
కవిత సంఖ్య : 167+1
తెలుగువారి తేజమైన
తిరుత్తణి ముద్దుబిడ్డ
వీరాస్వామి సీతమ్మల
కన్నబిడ్డ ....
భారతీయ తత్వ జ్ఞానంలో
వివేకం ... తర్కం ... ఇమిడి
ఉన్నాయని చూపించి గెలిచిన
నిజమైన తత్వశాస్త్రజ్ఞుడు ....
ఉపాధ్యాయుడుగా మొదలెట్టి
గుర్తింపు గౌరవాలతో
తొలి ఉపరాష్ట్రపతి పదవి పొంది
రాష్ట్రపతిగా రాణించిన ధీశాలి ....
అభిమానుల కోరికను
కాదనలేక... పుట్టినరోజు
కాకుండా ఉపాధ్యాయ దినముగా
జరిపించమన్న విశాల హృదయుడు ...
లెక్కలేనన్ని రచనలతో
జాతి సంస్కృతిని గౌరవాన్ని
ఇనుమడింపజేసి విశ్వానికి
చాటి చెప్పిన విదుషీమణి ....
రాష్ట్రపతిగా ఉన్నప్పుడు
వేతనాన్ని 75 శాతం
ప్రధానమంత్రి నిధికి
మళ్లించిన ఘనశాలి....
భావి విద్యార్థులకు మార్గదర్శిగా
బహు దొడ్డగ బాటలు వేసిన
మనిషి భారత రత్న పొందిన
మన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్
నగునూరి రాజన్న
No comments:
Post a Comment