Friday, December 2, 2022

ఆజాదీకా అమృత మహోత్సవ్ తేదీ : 15-08-2022 శీర్షిక : పీటమెక్కె పూరింట

 ఆజాదీకా అమృత మహోత్సవ్ 

తేదీ : 15-08-2022
శీర్షిక : పీటమెక్కె పూరింట 
కవిత సంఖ్య : 158+5

పండగలా పలకరించే 
పంద్రాగష్టు సుదినం 

స్వాతంత్య్రపు సంబరం 
అంబరాలనంటంగా 
వజ్రోత్సవ మహోత్సవం 
వసంతాల సమున్నతం.... 
 
కోటలన్నీ దాటుకుని 
పీటమెక్కె పూరింట 
కోటరీలే  కాకుండా 
కోట్లాది ప్రజల మనసులో .... 

ఢిల్లీ నుండి బయలెల్లి 
పల్లెదాకా  చేరినది 
గుడ్డి గుడిసెనాదరించి 
గుడి శిఖరం చేరింది .... 

గుండె నిండ వందనమని 
గుది గుచ్చి నవ్వినది 
మదిమదిన ఆనందం 
మరవలేని సొంతంగా  .... 

కార్మికుడు కర్షకుడు
ఏకమై నిర్వహించె 
ఆజాదీ అమృతం 
ఆనందమై  సేవించ ... 

సామాన్యుడు సైనికుడు 
సంబరంగ ఆడిరి  
అంబరాలు నింపుతూ  
విశ్వమంత వేడుకగా .... 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment