Friday, December 2, 2022

కవన రవలి గజల్ 21-08-2022

 కవన రవలి 

గజల్  21-08-2022

మధురలోన జన్మించగ 
కదలివచ్చె గోపాలుడు 
బృందావన విహారిగా 
తరలివచ్చె గోపాలుడు 

యశోదమ్మ మాతృత్వం 
ఎదలు నింపి తృప్తిపరిచె 
మన్నుతినీ మహిని చూప 
మరలవచ్చె  గోపాలుడు 

కాళిందిని లొంగదీసి 
గోవర్ధన గిరినెత్తీ 
వ్రేపల్లెను గోపకులను 
కాయగవచ్చె గోపాలుడు 

కంసున్నీ చాణూరుల 
కడతేర్చగ మథురకునూ 
బలరాముడు వెంటరాగ 
తిరిగివచ్చె గోపాలుడు 

అష్టమహిషు ఇష్టసఖుడు 
సుధామునీ  మిత్రుడిగా 
పాండవులకు సన్నిహితై 
వరములిచ్చె గోపాలుడు 

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment