జానపద గేయం
తేది : 23-07-2022
శీర్షిక : పర్యావరణం
కవిత సంఖ్య : 944
వినరా ఓ మానవా
కనరా దుశ్చర్యలు... //2//
అమ్మలాంటి నేలతల్లి
అపహాస్యం చేస్తూనే ....
చెరువులన్నీ చెరబట్టె
చేతలెందుకు చేస్తున్నవు ...
చినుకు వానకు చిక్కి నీవు
చిగురుటాకులా వణుకుతున్నవు
వరస వానలకు బిక్కుమని
వరదలంటూ వాపోతున్నవు //
వినరా //
తల్లిలాంటి తరువులను
తెగనరికి పోగుపెడుతూ
గండశిలలు పిండి చేసి
ఇసుకనేమో తోడుచుంటివి...
చెట్టు గుట్ట వాగు వంక
ప్రకృతమ్మ వరములు
అవసరాలకే వాడుకో
అత్యాశలకు తావులివ్వక //
వినరా //
జీవరాశిలో మిన్న నేనని
విర్రవీగుతున్నవా నువ్వు
ఉన్నవాడి కోరికలకు
ఉసురులేమో లేనివాడికి ...
ఒక్కమాటగా కదలరా
కలిసికట్టుగ నిలవరా
ఉక్కుసంకల్పం తోడ నీవు
చెక్కు చెదర నీయకురా ... //
వినరా //
సాదనీటిని తాగలేక
సాహసాలే మరిచితివి ....
కలుషితాల నీరునీకు
గుణపాఠం అయేకదరా ...
సాంకేతికత సంక దూరి
సరసజీవితం మరుస్తుంటివి
ప్రాణవాయువుకు అల్లాడుతూ
ప్రాణాలనే వదిలెదవా ..... //
వినరా //
నగునూరి రాజన్న
No comments:
Post a Comment