Monday, October 4, 2021

చిత్ర కవిత ఆధునిక రథం తేది : 06-08-2021 (an auto riksha decorated with greenary )

 చిత్ర కవిత 

ఆధునిక రథం 
తేది : 06-08-2021
కవిత సంఖ్య : 40+3

అలంకరించుకున్నది ఆధునిక రథం 
అలరించి జనుల మనసులు రంజింప 
గ్రీష్మ తాపాలనుండి భీష్మంగ రక్షింప 
ప్రకృతి పచ్చదనాలను పదిలపరుస్తూ ..... 

పచ్చ తివ్వాచీని పరుచుకున్నది పైన..  
పలు కుండీలను పెట్టుకున్నది చుట్టూ 
పల్లవించి  .. తాను కూడా ప్రకృతికి 
పట్టుకొమ్మనటంచు ప్రత్యక్ష సాక్షిగా..... 

అప్పనంగా పన్నులు వేసే అధికారులు 
బతుకులు  ... బాటలు పట్టని పాలకులు 
గతుకుల రోడ్లలో బతుకులు సరిచేసుకోను 
బయలు దేరాడు అభినవ రథసారథి ..... 

కోటి విద్యలు కూటి కొరకు  ప్రదర్శనలా 
నీటుగా ముస్తాబై...  నిండు అందాలను 
హత్తుకుని... వెయిట్ చేస్తున్నాడు పాపం ... 
వేళకు దొరికే గిరాకీ కోసం ... రహదారిన.... 

దీనమైన చూపుల్లో జారిన ధీరత్వం 
భరోసాలు లేని బతుకు బేరాలకోసం 
నమ్ముకున్న వారికి నాలుగు మెతుకులు 
నందనంగా కడుపు నింపే కలల సౌధంతో  .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment