Thursday, October 14, 2021

ప్రేమ ప్రయాణం తేదీ 26-08-2021

 ప్రేమ ప్రయాణం 

తేదీ 26-08-2021
శీర్షిక :  అందమైన సుందరం 
కవిత సంఖ్య : 738

వయసు వంక తీర్చినట్టు 
కనులలో మెదిలిన రూపం 
కనికట్టు చేసి మదిలో 
ఓ కమ్మని రూపం పరుచుకుంది. ... 

మాటలు వినపడితే చాలు 
మంత్రముగ్దతలను విరజిమ్మి 
రూపం కనపడితే చాలు 
ఓపని భావనాలకు లోనవుతూ .... 

పారదర్శకమైన మనో తెరపై 
పనికట్టుకుని చిత్రం గీసి 
పగలు రేయిలను కలిపేసి 
పనులు చేయకుండా పెనుగు 
లాడుతుంది ..... 

మరిచిపోకుండా ... మరీ మరీ 
గుర్తుకొచ్చి మారాములు చేసి 
గోముగా ఏదైనా వినాలనే 
తపనలను పంచుతుంది .... 

ఎవరేమి చెప్పినా విననీయదు 
ఎవరడ్డువచ్చినా  కోపమే ... 
అనుభవజ్ఞులు  చెప్పిన మాట 
అనుభవ శూన్యమన్న భావన .... 

సుఖ ప్రయాణమైతే 
సుందరమైన ఆనందమే 
విశ్వమంతా వినోదమే ..... 
వినీలాకాశంలో విహరిద్దాం .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment