Thursday, October 21, 2021

జాజిపూల జావళి తేది : 30-08-2021 శీర్షిక : అమర ప్రేమ

 జాజిపూల జావళి

తేది : 30-08-2021
శీర్షిక :  అమర ప్రేమ                                         
కవిత సంఖ్య : 741

స్వచ్ఛమైన మనసులకు 
మాత్రమే సరళంగా అర్ధమయ్యే 
సర్వజితుని అనంత  ప్రేమలు 
సఖి రాధమ్మతో కూడి ...... 

యాదవేంద్రుని జ్ఞాపకాలే 
వేణుగానం మదిలో మోగుతున్నట్టు 
శిఖపించ మౌళి పింఛం  
ముఖ బింబంపై  పారాడినట్టు .... 

అల్లనల్లన కదులుతున్న 
చల్లని గాలి సైతం గమకమై 
మేను తమకమౌతుంటే 
మదిలో వీణలు మోగగా ..... 

వయ్యారాల అడుగులు 
సవ్వడి చేస్తుంటే .. వాలు 
జడల జాజి పూలు జావళీలు 
పాడుతుంటే.... కనులు మూసినా 
తెరిచినా రాధమ్మకు కృష్ణుడే ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment