కలసి పోతున్నాను
తేదీ : 21-08-2021
శీర్షిక : ;ఇమిడి పోతున్నాను
కవిత సంఖ్య : 154
కనులు మూసినా తెరిచినా
అమ్మ నాన్నలు చదువే ముఖ్యమని
ఎంతో మంత్రించినా ... తొమ్మిదిలో
మొదలైన తెలంగాణ ఉద్యమ
నీడలో.... ఇమడలేక ... చదవులకై ...
విద్యార్థుల్లో కాట కలసి పోయా ను ...
పదకొండులో పట్నమొచ్చి
పైలా పఛీసులా తిరిగి తిరిగి
పన్నెండు పరీక్షలవరకు
వెండి తెరల జాడల్లో దండి
దొరగా తిరిగేసి ...ఇమిడి పోలేక
చదవలేక ... ఇరుక్కుపోయాను ...
అలా అలలా కదులుతున్న
జీవన సంద్రపు యానంలో....
కఠిన శిలల వైఖరుల కలబోతలా ....
ఉరుముల మెరుపుల ఉపకులపతి
గారు మమ్మందరిని ఉరికించినారు...
తిరిగి తిరిగి మేమంతా మళ్ళీ
విద్యా సంద్రములో కలిసి పోయాము ...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment