Monday, October 4, 2021

ప్రేమ కావ్యం తేది : 21-07-2021 శీర్షిక : అన్నీ ప్రేమ కావ్యాలే ....

  ప్రేమ కావ్యం

తేది : 21-07-2021
శీర్షిక :  అన్నీ ప్రేమ కావ్యాలే .... 
కవిత సంఖ్య : 711

పెళ్ళికి ముందు ప్రేమ ఒక 
చిలిపి నవ్వుల కావ్యమైతే  
తదుపరంతా మధుర కావ్యమై 
మదిలో  నిలిచి పదిలపరుచు .... 

ఆచార సంప్రదాయాల గొడుగు నీడలో
అల్లుకున్న బందాలన్నీ ... బండెద్దుల్లా 
బతుకు బాటలో ఒడిదుడుకులను 
ఎదుర్కొంటూ ఎన్నెన్నో అడుగులేసి 
బాటసారుల్లా కలిసి సాగుతూనే ఉంటాయి ... 

కష్టాల కడలిలో కదిలిపోకుండా 
క్షణంలో తేరుకున్న గరికలా 
అనుభవాలను ప్రోది చేసుకుంటూ  
సుఖాల నెక్కిన సుక్కల పందిరి నీడలో 
ఆనందాలను పంచుకుంటుంటారు  ..... 

గొప్పోళ్ళ గోత్రాలకు మాత్రమే 
గొడుగులు పట్టే గతాల నీడలు 
అడుగడుగున కదిలిపోయే 
జనసామాన్యుల లెక్కలకు ఒక్క 
పేజీ కూడా కేటాయించదు ..... 

ఆనవాళ్ల వివరాలు అందరికి 
అందుబాటుండక పోయినా... 
లెక్క లేనంత మంది జీవితాలలో 
జరిగేవన్నీ అపురూప ప్రేమ కావ్యాలే..... 

నగునూరి రాజన్న 
కరినగరము  

No comments:

Post a Comment