చివరకు గెలిచేది ...
తేదీ : 23-08-2021
శీర్షిక : నీతి నిజాయితీలే ...
కవిత సంఖ్య : 735
తాత్కాలికంగా తామే
గెలిచామని... గెలుస్తున్నామని
గొప్పలు పోయినా ....
అన్యాయానికి తెలుసు
అంతమౌతానని ....
అక్రమానికి తెలుసు
తెగ నరకబడతానని.....
అధర్మానికి తెలుసు
నిలవలేనని.....
అవినీతికి తెలుసు
చితికి పోతానని ....
చెడుకు తెలుసు
ఎక్కువ కాలం బతకలేనని ....
అయినా మేకపోతు గాంభీర్యాలతో
నటిస్తూ .... కాలం నెట్టుకొస్తూనే
ఉంటాయి ....మనిషిలోని అహాల
నీడలలో ఒదిగిన కపట
కరటక దమనకుల్లా
సదా సహకారాలందించగా .... .
అనుభవజ్ఞుల నోట ప్రతి పూట
ఆలకిస్తూనే ఉంటాము.......
ధర్మం మనల్ని ఉద్ధరిస్తుందని
న్యాయం అందరికి క్షేమమంటూ
సత్యం చాలా గొప్పదంటూ
మంచిని మించింది లేదంటూ
నీతికి అంతా భీతిల్లాల్సిందే నంటూ
నిజాయితీకి ఎప్పుడూ పెద్ద పీటే నంటూ
పాలలో దాగినా నెయ్యిలా
పరిణతి చెందితే గాని .....
పరిపక్వతగా బయల్పడదనీ ....
సంకల్పం నీతి సూత్రమైతే ...
దృఢదీక్ష ధర్మ యుక్తమైతే
గమనం న్యాయ పూరితమైతే
పట్టుదల క్రమశిక్షణ సత్యపూరితమైతే
ఫలితమెప్పుడూ నిండుగా కాసిన
తరువులా సంపూర్ణమౌతుంది .....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment