Thursday, October 14, 2021

దశగుణనిధి తేది : 24-08-2021

 దశగుణనిధి 

తేది : 24-08-2021
కవిత సంఖ్య : 30+12

దాశరథీ దశ గుణ నిధీ
తేట తెలుగువారి పెన్నిధి.  
విప్లవాల గడ్డ తెలంగాణ ముద్దు బిడ్డ 
బ్రహ్మ శ్రీ వెంకటాచార్యులు 
శ్రీమతి వెంకటమ్మ గార్ల కన్న బిడ్డ .... 
అపురూపమైన అన్నకు తగ్గ తమ్ముడు 

తెలంగాణ సాయుధ పోరాటాల 
ముందటి  ఉనికిని, నడకను, 
అంతరాలను....చిల్లర దేవుళ్ళు, 
మోదుగుపూలు జనపదం లో
జాగృత పరిచారు ..... 

అన్నగారి సాంగత్యంలో అభ్యుదయ 
భావాలను అలవర్చుకుని 
అసమానతలను, అణిచివేతలను 
ఎండగట్టారు.  

నిజాం పాలనలను, గడీల దొరల 
రాక్షస పాలనలను నిలువు 
దోపిడీలను  నిలువునా ప్రశ్నించి 
ఎదురు నిలిచారు.  

కమ్యూనిష్టుగా కొంత ముద్రపడినా 
వేదం-జీవననాదంగా  తెలుగులో అందించి
ఆధ్యాత్మికతలను అవపోశన పట్టి
అతి సరళతలో మహాభారతం రామాయణం 
అందించి అతిరథ మహారథి అనిపించుకున్నాడు.  

నగునూరి రాజన్న 

No comments:

Post a Comment