పిట్ట కూయడం లేదు
పిందె కదలడం లేదు
పత్రికలన్నీ వాపోతున్నవి
టీవీలన్నీ దుఃఖిస్తున్నవి
మరణాలేమో లెక్కతేలక
గణాంకాలన్నీ తెల్లబోతున్నవి ...
భద్రం సొదరా జర భద్రం
భరోసాలేని శ్వాసలైనాయి
బతుకు బండి తెల్లారుతుందో లేదో
తెలియని గమనమైనది.....
కదలికలపైన నిషేదంతో
కలయికలపైన నిరాశలు
మరణ మృదంగాల ఘోషతో
కీచురాళ్ళు సైతం నిశ్శబ్దం ....
గుండె లయలు తప్పకుండ
అండగ నువ్వున్నావనే ఆనవాళ్లకు
స్మార్ట్ పోనులో పోస్టింగుల్లా
అప్పుడప్పుడు కనిపిస్తూండు...
ఇదివరలా కలవడం కుదరకపోయినా
అప్పుడప్పుడు జ్ఞాపకాల పోపులతో
ప్రాణవాయువుల పలకరింపులు
ఈ ప్రాణానికి అవసరం మిత్రమా .....
నగునూరి రాజన్న
కరినగరము.
No comments:
Post a Comment