Thursday, October 14, 2021

కులుకు తేది :19-08-2021

 కులుకు

తేది :19-08-2021
శీర్షిక : మహాలక్ష్మి ... 
కవిత సంఖ్య : 153

క్షీరాబ్ది కన్నియట 
శ్రీమహాలక్ష్మియట 
కులుకులన్నీ కలబోసిన 
కలికి మహాలక్ష్మియట ..... 

అలకబూని అవతరించె 
భూలోకమున .... 
సన్నుతించి సమ్మతించె 
అలమేలు మంగగా ..... 

బంగారు పువ్వులో 
సింగారించుకున్న 
శ్రీ మహాలక్ష్మియే 
శ్రీవారి పట్టమహిషి ..... 

అన్నమయ్య కొనియాడే 
అన్ని నామముల ... నాడే 
అమృతవల్లీ ... ఆ తల్లిని  ... 
ఆదరించి కరుణించే 
తన భక్తులను .... నిత్యం ..... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment