Monday, October 4, 2021

చిత్ర కవిత తేది : 30-07-2021 శీర్షిక : ఆట విడుపు (children playing in new waterfor fishing )

 చిత్ర కవిత

తేది : 30-07-2021
శీర్షిక : ఆట విడుపు
కవిత సంఖ్య : 41

తొలకరితో తలంటు స్నానం చేసిన
ధరణీ మాత ... పాయలు పాయలుగా
పారి ... వాగు వంకలు నదులు  పొర్లి
పొంగుతూ కొత్త నీటితో ఉరకలేసే ....

పచ్చ తివాచీలు పరిచినట్టు
ఇరువైపులా నిలిచిన పెట్టని
కోట గోడల్లా నిలిచి వాన ధారలకు
వాలుగా తలలూపుతున్నాయి
గరిక సైనికులు గమ్మత్తుగా .....

చెరువు వాలున చెంగున మత్తడి
దూకుతున్న కొత్త నీటి నురగల్లో
ఆనందపు కేరింతలతో హాయిగా
ఆడుకునే ఆట పాటల పిల్ల మూకలకు 
ఆటవిడుపాయే .....

ఎదురు పారే మీనములకై
విదుర నీతుల వలలు విసిరి
కొమ్ము కాసిరి కోతి మూకలా
పిల్ల కాకులు పిసరంత ఆనందాలను
పితికి పోగేసుకోవడానికై .....

నగునూరి రాజన్న
కరినగరము

No comments:

Post a Comment