Monday, October 4, 2021

కొత్తపల్లి జయశంకర్ గారు తేది 06-08-2021 శీర్షిక : కోరకుండ వరమయ్యావు

 కొత్తపల్లి జయశంకర్ గారు 

శీర్షిక : కోరకుండ వరమయ్యావు 
తేది: 06-08-2021
కవిత సంఖ్య : 40+4 

కొత్తపల్లి జయశంకర్ సారూ 
కోరకుండా వరమైనారు 
జయహో జయశంకర్ గారు 
జబర్దస్తీగా అడిగావు... 
 
తెలంగాణ కావాలని 
తేట తెల్లం చేసావు 
ఆజన్మ బ్రహ్మచారిగా 
అంకితమే చేసుకున్నావు. 

తమిళ వాదం మాకు వద్దని 
తకురారు చేసినావు 
సాంబారు గో బ్యాకని 
పోరి నువ్వు నిలిచావు ... 

చిన్న చూపు చూసినోళ్ల 
భరతమైతే  పట్టినావు 
వలస వాదుల పాలనలో 
వంకలన్నీ ఏకరువు జేసీ  .... 

ఉన్నత చదువులు చదివినా 
ఉపకులపతిగా ఎదిగే క్రమంలో      
ఉక్కుపాదాల తొక్కిసలాటలో
ఊపిరాడని క్షణాలను లెక్కించావు .... 

అడుక్కోవడం మాకొద్దని 
అధికారం కావాలని 
సమయానుకూలంగా 
సలహాలిస్తూ వచ్చావు .... 

అహోరాత్రులు ఆరాటపడి 
తెలంగాణా కోరిక తీర్చావు 
జయహో జయశంకరుడా 
జయం జయం నీ చరితా .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment