ఉపాధ్యాయ గీతాలు
తేది : 04-09-2021
శీర్షిక : మాష్టారు
కవిత సంఖ్య : 746
మాష్టారు మాష్టారు
మా మంచి మాష్టారు
అమ్మానాన్నలు జన్మనిస్తే
ఆత్మీయంగా బతుకిచ్చి
ఆశీస్సులనందించిన
దేవుడివయ్యా ...ఆ దేవుడివయ్యా
// మా //
నలు వైపుల వ్యాపించి
దేశమంత అల్లుకుని
చిన్నచితక పిల్లలను
చిత్రంగా చేరదీసి // మా //
అమ్మ లా లాలించి
నాన్నలాగ మందలించి
అక్షరాలు నేర్పించి
సక్కంగా నిలబెట్టావు // మా //
అపాయాలు తెలిపి నీవు
ఉపాయాలు బోధిస్తూ
ఆట పాట నేర్పించి
నైపుణ్యత పెంచావే ... // మా //
ఎండపొడలు పడకుండా
నింబ వృక్ష నీడనిచ్చి
అడుగడుగున జాగ్రత్తగ
నడకలు నేర్పించావు // మా //
భావి పౌరుల తీర్చిదిద్ది
జాతికీర్తిని ఇనుమడించి
దేశ భవితను సక్కదిద్ది
వృత్తులలో నీ స్థానం
ఉన్నత మనిపించావు ... // మా //
వృత్తులలో నీ స్థానం
ఉన్నత మనిపించావు ... // మా //
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment