నేల మీద జాబిల్లి
తేది: 06-08-2021
శీర్షిక : పత్తి చేను
కవిత సంఖ్య : 148
అధిక మోతాదున్న ఆత్మాభిమానమోలే
దక్కనులో నీటి ఎద్దడితో దుక్కులన్నీ
బిక్కు బిక్కు మంటున్న వేళ...
అప్పుడప్పుడోచ్చిపోయే చుట్టమోలే
ఆరు తళ్లు చాలంటూ .. పంటలెన్నో
దిగుమతాయే పలు రకాల వాణిజ్య పంటలు ....
ఉష్ణ మండలాలే ఉనికిగా ఏర్పడే
పల్లి, మొక్కజొన్న మిర్చీలే కాకుండా ...
పత్తి పంటలకు కూడ మంచి ఎరుక అయ్యే ....
రోటీ కపడా అవురు మకాన్ అనే
అత్యవసరాలలో ఆది రెండవదిగా
నిలిచిన బట్టకు మూలమయిన పత్తి ....
ధవళ కుసుమాలను దండిగా పండించి
దారం ఉత్పతిలోన దన్నుగా నిలిచె...
దిగుమతులు తప్పించి ... ఎగుమతుల
స్థాయి పెంచి ఎత్తు కెదిగిన భారతాన ....
నిండుగా పండిన పత్తి చేనంటే
పొందుగా కూర్చున్న పుడమితల్లి
ఒడిలో.... జాబిల్లి నేలపై పారాడినట్టు ....
చూపారులకెంతో ఆహ్లాదం ... ఆనందం ....
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment