Monday, October 4, 2021

మేఘం నీవైతే ... తేది : 16-08-2021 శీర్షిక : నీ తోడే నా దారి ....

 మేఘం నీవైతే ...

తేది : 16-08-2021
శీర్షిక : నీ తోడే నా దారి .... 
కవిత సంఖ్య : 30+7

పుష్కలావరపు  మేఘం నీవైతే 
పుణికి పుచ్చుకునే  పైరగాలిని నేనౌతా 
కురిపించి తొలకరిని...
చిరునవ్వుల  చిరునామా అవుదాం .... 

మధు మేఘం నీవైతే 
సుధలు కురిపించే రాగం నేనౌతా 
హరివిల్లుల ఛాయలలో 
విరిజల్లులు కురిపిద్దాం ..... 

అవని మాతను అభిషేకించి 
హాలికులను సంతసింపజేసి 
అంకురాలను పలకరించి 
సస్యశ్యామలాలకు ఊతమిద్దాం .... 

అల్లన వీచే పిల్లగాలిని నేనై 
కొండా కోనలు దాటుకుని 
మెండుగా పాడి పంటలకై 
నీ వెంట పదం కలుపుతాను ..... 

నీలి మేఘం నీవైతే 
వన విహారిని నేనౌతా .... 
అందాల ప్రకృతిలో 
సుందరాలు తిలకిద్దాం .... 

నగునూరి రాజన్న 
కరినగరము 

No comments:

Post a Comment