పల్లవించావా నా గొంతులో ....
తేది : 06-08-2021
శీర్షిక : ఆదుకోవా ... ఓ దేవా...
కవిత సంఖ్య : 721
పల్లవించావా నా గొంతులో ....
ప్రాణమై నిలవవా నా పాటకు
ప్రతి పూటా ప్రతీ క్షణం
నీ ధ్యాసే... నీ ఊసే.. ఓ దేవా ....
అందమైన ఆనందాలు
సుందరమైన అనుభవాలు
అంతా నీ కృపా కటాక్షాలే
అది మరచిన నాడు అంతా శూన్యమే....
పాప పుణ్యాల పరిహారంగా
దొర్లిపోయిన నా జన్మలు
ఎదుట నిలిచిన ఈనాటి రూపం
కడతేరే చివరి క్షణం దాకా ....
కాచుకోవా అడుగడుగున
కరుణించి ప్రతీ క్షణం
కారుణ్యమూర్తి నీవే దిక్కయి
కడదాకా పాలిస్తూ ......
నమ్ముకున్నా... నిన్నేనని
నా నోటా నీ మాటే రావాలని
ఏ ఆటంకం లేకుండా
ఆదుకోవా ... ఓ దేవా...
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment