భావ గీతం
తేది : 14-08-2021
శీర్షిక : ప్రకృతే పరమోన్నతం
కవిత సంఖ్య : 728
పదే పదే నిరూపితమే
ప్రకృతి మాతె ఎపుడు
పరమోన్నతమంటూ .....
తొలకరితో చినుకులను
అవని పైన చిలకరించ...
ఆశపడిన హాలికుడు
అప్పుజేసే పంటలకై .... //పదే పదే //
అదను చూసి మబ్బులేమో
చాటేసే తమ ముఖము
విత్తిన విత్తనాలన్నీ ...
ఎదురుచూసి ఎత్తిపోయే //పదే పదే //
ఆశపడిన రైతు మోము
దీనంగా దిగులు పడే
చేసిన అప్పులేమో
తప్పని బాకీగ నిలిచే //పదే పదే //
కలుషితాల ఫలితమో
కాలుష్యపు కోరలో
కలికాలపు ఋతువులన్ని
కాట గలిసి మాట మార్చె //పదే పదే //
ఓ మనిషీ మేలుకో
నీ తప్పును దిద్దుకో
పవిత్రంగ భావించు
ప్రకృతిని పూజించు //పదే పదే //
నగునూరి రాజన్న
కరినగరము
No comments:
Post a Comment